2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం .. – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / 2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..

2019లో పీఎం నరేందర్ మోదీనే -ఏపీ సీఎం చంద్రబాబు జోష్యం ..

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే.

అయితే ఇలాంటి తరుణంలో రానున్న ఎన్నికల్లో మరల బీజేపీ పార్టీ గెలుపొంది కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకున్నారు.ఇదే అంశం గురించి ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ప్రధానమంత్రి నరేందర్ మోదీకి పూర్తీ మద్దతు ఇవ్వాలనే ఆశతో ఉన్నారు .

గత నాలుగు ఏండ్లుగా ఎన్డీఏ సర్కారు అమలు చేస్తున్న పలు అభివృద్ధి పథకాల వలన 2019ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచి ..మరల ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారని చంద్రబాబు అను నేను కోరుతున్నాను అని ముప్పై రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల సాక్షిగా ఎన్డీఏ సమావేశంలో తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు అని అన్నారు ..