పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ ల మద్య ఎలా, ఎక్కడ జరిగింది..? – Dharuvu
Breaking News
Home / Uncategorized / పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ ల మద్య ఎలా, ఎక్కడ జరిగింది..?

పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ ల మద్య ఎలా, ఎక్కడ జరిగింది..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , పూనమ్ కౌర్ మధ్య సంబంధం ఏంటి ? ఈ ప్రశ్న కి సమాధానం చెప్పాల్సింది ఆ ఇద్దరే. అయితే కత్తి మహేష్ ఆ టాపిక్ తెచ్చాక ఆ ఇద్దరూ పైకి మాట్లాడింది లేదు. కత్తి మాటలు నిజం అని గట్టిగా నమ్మలేకపోయినా పవన్, పూనమ్ గురించి కాస్త డౌట్స్ అయితే వచ్చాయి. అయితే పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ ల మధ్య రచ్చ జరుగుతున్నప్పుడు మధ్యలో దూరి కత్తి మాటలకు బలి అయింది పూనమ్ కౌర్ .దీంతో పూనమ్ కు ఆరు ప్రశ్నలు సంధించి ఆమెకు ముచ్చెమటలు పట్టించాడు. కాని ఇప్పుడు ఈ కూపీని లాగడానికి టీడీపీ పన్నాగాలు పడుతుందని సమాచారం.

టీడీపికి చెందిన ఒక ఛానల్ ఈ వ్యవహారానికి సంబందించి మొత్తం సమాచారం, పక్కా ఆధారాలను సేకరించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ ల మొదటి పరిచయం ఎలా , ఎక్కడ జరిగింది, వారిద్దరి మద్య సాన్నిహిత్యం ఎంత దూరం వెళ్లింది అన్న అంశాలను చేధించడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేశారట. ఇప్పటికే ఆ టీమ్ ఆమె స్వస్థలం పంజాబ్ బయల్దేరడానికి సిద్దమయ్యారట. త్రివిక్ర‌మ్ అంటే పూన‌మ్ కౌర్ కు ఎందుకు కోపం, అసలు వారిద్దరి మధ్య త్రివిక్రమ్ ఎలా వచ్చాడు. ఆమె చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక కావడం వెన‌క అసలు ఎవరున్నారు వంటి కోణాలపై దర్యాప్తు జరిపిస్తున్నట్లు సమాచారం. మరో హట్ న్యూస్ ఏమిటంటే పూనమ్ పాత ఫోటో ఒకటి దొరికింది. ఆ ఫొటోలో ఆమె ఛాతీ మీద పీకే అనే టాటూ మీద నెటిజెన్ల కన్ను పడింది. పీకే అంటే పూనమ్ కౌర్ అని అనుకోవచ్చు లేదా పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. ఎవరి దృష్టి కోణాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు.