వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్..!! – Dharuvu
Breaking News
Home / SLIDER / వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్..!!

వాట్సప్ లో మరో అదిరిపోయే ఫీచర్..!!

వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది. డిలీట్ చేసిన వాటిని తిరిగిపొందే అవకాశం ఇది కల్పిస్తుంది. డబ్ల్యూబీటాఇన్ఫో కథనం ప్రకారం ఆండ్రాయిడ్‌ బీటా యాప్‌ యూజర్ల కోసం దీన్ని పరీక్షిస్తోంది. అది సక్సెస్ అయితే స్మార్ట్‌ఫోన్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ నుంచి ఏమైనా ఇమేజస్‌ను, జీఐఎఫ్‌ఎస్‌ను, వీడియో, ఆడియో ఫైల్స్‌ను, ఆడియో రికార్డింగ్‌లను, డాక్యుమెంట్లను డిలీట్‌చేస్తే, వాటిని తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. డివైజ్‌లలో తక్కువ స్టోరేజ్ కలిగి ఉన్న యూజర్లకు ఇది ఎంతో ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు.

దీంతోపాటు మరో అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇద్దరి మధ్య సంభాషణలను మరొకరు చూడకుండా ఇది చేయగలుగుతుంది. ఓ యూనిక్‌ సెక్యూర్‌ కోడ్‌ రూపంలో ఛాట్‌ను కొత్త ఫీచర్ భద్రపరుస్తుంది. దీంతో అది వాళ్లిద్దరు మాత్రమే చూడగలిగేలా ఉంటుంది. విశేషం ఏంటంటే ఒక్కో ఛాట్‌కి ఒక్కో ప్రత్యేకమైన్‌ కోడ్ ‌జనరేట్‌ అవుతుంది. దీంతో చివరికి వాట్సప్‌ సైతం ఆయా మెసేజ్‌లను చూసే వీలుండదు. ఇది కొత్త ఫీచర్‌లో ఉండే సౌలభ్యం.