ఆంధ్రజ్యోతి పై పవన్ అభిమానుల దాడి..తీవ్ర ఉద్రిక్తత..! – Dharuvu
Breaking News
Home / MOVIES / ఆంధ్రజ్యోతి పై పవన్ అభిమానుల దాడి..తీవ్ర ఉద్రిక్తత..!

ఆంధ్రజ్యోతి పై పవన్ అభిమానుల దాడి..తీవ్ర ఉద్రిక్తత..!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక నటిని అడ్డుపెట్టుకొని నాపై కుట్రలు చేశారు. అందుకు పలు మీడియా సంస్థలకు పది కోట్ల మేర డీల్ ఒప్పందం చేస్కొని నాపై బురద చల్లుతున్నారు.ఒకానొక సమయంలో నన్ను చంపడానికి కుట్రలు కూడా చేస్తున్నారు అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేగాక అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు చేస్తోన్న కుట్రలను విమర్శించే క్రమంలో పవన్‌ అతితీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

‘‘ సీఎం చంద్రబాబు గారు.. ప్రత్యేక హోదా సాధన కంటే.. పచ్చ చానెళ్లు చేస్తోన్న వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించడంపైనే మీరు ఎక్కువ శ్రద్ధపెట్టారు. అసలు మీ ఉద్దేశం ఏమిటి?’’అని పవన్‌ నిలదీశారు.దీంతో పవన్ అభిమానులు ఆగ్రహంతో ఆంధ్రజ్యోతి మీడియా వాహనలపై పవన్ అభిమానుల దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత దారి తీసింది.పోలీసులు వేంటనే స్పందించి బద్రత కట్టుదిట్టం చేసి దాడిని అడ్డుకున్నారు.