ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌త్య‌కు భారీ కుట్ర‌..!! – Dharuvu
Home / ANDHRAPRADESH / ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌త్య‌కు భారీ కుట్ర‌..!!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌త్య‌కు భారీ కుట్ర‌..!!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.. జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య విభేదాలు ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉన్నాయి. అయితే, 2014 ఎన్నిక‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని జ‌న‌సేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు క‌లిసి పోటీ చేయ‌డంతో.. కేవ‌లం రెండు శాతం ఓట్ల‌తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జ‌న‌సేన‌, బీజేపీ, తెలుగుదేశం కూట‌మి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత చంద్ర‌బాబుపై నోటుకు ఓటు కేసు న‌మోద‌వ‌డంతోపాటు.. ప్ర‌జా సంక్షేమం కోస‌మంటూ చేప‌ట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో సీఎం చంద్ర‌బాబు భారీ కుంభ‌కోణాల‌కు పాల్ప‌డ్డారంటూ ప‌లు ప‌త్రిక‌లు ఆధారాల‌తో స‌హా వెలుగులోకి తెచ్చాయి.

see also : ఆ డ‌బ్బు చంద్ర‌బాబు, లోకేష్‌ల‌దే.. గుట్టు విప్పిన శేఖ‌ర్‌రెడ్డి..!!

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్ కూడా చంద్ర‌బాబు అవినీతిపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అంతేకాక‌, చంద్ర‌బాబు త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌కు, టీటీడీ బోర్డు మాజీ స‌భ్యుడు శేఖ‌ర్‌రెడ్డి మ‌ధ్య ఆర్థిక అక్ర‌మ లావాదేవీలు జ‌రుగుతున్నాయ‌ని, అందుకు సంబంధించిన పెన్ డ్రైవ్‌లు నా వ‌ద్ద ఉన్నాయంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ పెన్‌డ్రైవ్‌ల వ్య‌వ‌హార‌మే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రాణాల‌మీద‌కు తెచ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

see also : న‌న్ను చంపేందుకు.. చంద్ర‌బాబు, లోకేష్‌ రూ.10 కోట్లు డీల్‌..!!

పై మాట‌ల‌ను రుజువు చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా.. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని చెప్పిన విషయం తెలిసిందే. ఇంకా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్‌లో ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న‌ను చంపేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ కుట్ర ప‌న్నార‌ని, కుట్ర‌లో భాగంగానే కొంత‌మంది రౌడీల‌కు రూ.10కోట్లు పైగానే డీల్ కుదుర్చుకున్నారంటూ తెలిపారు.

see also : భరత్ అనే నేను సినిమా పై కత్తి మహేష్ ఆసక్తికరమైన పోస్ట్ ..!

అంతేకాకుండా, ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు, నారా లోకేష్‌ల‌తో శేఖ‌ర్‌రెడ్డికి ఉన్న ఆర్థిక సంబంధాలుపై ఈడీ విచారించింద‌ని, ఆ విచార‌ణ‌లో త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బంతా చంద్ర‌బాబు నారా లోకేష్‌ల‌తో అని శేఖ‌ర్‌రెడ్డి ఒప్పుకున్నారంటూ ఓ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ క‌థ‌నం ప్ర‌కారం జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఆరోప‌ణ‌లకు మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి. ఈ నేప‌థ్యంలోనే త‌న‌ను హ‌త్య చేసేందుకు చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు కొంద‌రు రౌడీల‌ను పుర‌మాయించి, వారితో రూ.10 కోట్ల డీల్ కుదుర్చుకున్నార‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.