తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..ఉత్తమ్ – Dharuvu
Breaking News
Home / TELANGANA / తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..ఉత్తమ్

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం..ఉత్తమ్

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ని కలిశారు.అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై రాహుల్‌కు వివరించామని.. అసెంబ్లీ బహిష్కరణకు గురైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయాన్ని రాహుల్‌కు తెలిపానని అయన చెప్పారు.ఈ సందర్భంగా అసెంబ్లీ బహిష్కరణపై కోర్టులో గెలిచి విజయం సాధించిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ అభినందించారని చెప్పారు.