Home / ANDHRAPRADESH / నెల్లూరులో తెలుగుదేశం ఖాళీ..వైసీపీలోకి తెలుగుదేశం కీలక నేతలు.!

నెల్లూరులో తెలుగుదేశం ఖాళీ..వైసీపీలోకి తెలుగుదేశం కీలక నేతలు.!

నిన్నటివరకు ఎంతమందెక్కిన…మా సైకిల్ మీద ఇంకొక్కరికి ఖాళీ ఉందంటు చెప్పుకొచ్చిన తెలుగుదేశానికి…తత్వం బోదపడే రోజు దగ్గరలోనే ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.నెల్లూరు జిల్లాలో అనం రామనారాయణరెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరికపై దాదాపుగా ఖరారయ్యింది. నిన్నటి వరకు ఆనం ఆఫీసులొ గొడ మీద నవ్వుతూ ఉన్న చంద్రబాబు పటం…ఇప్పుడు చెత్తబుట్టలొ పడి ఏడుస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు .నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే కొన్నేళ్ల క్రితం టీడీపీలో చేరిన అనం సోదరులు వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డి కారణంగా జిల్లాలో టీడీపీకి ఏమైనా ఉపయోగం ఉందా అనే దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో చేరిన నాటి నుంచి తమకు ఎప్పుడెప్పుడు పదవులు వస్తాయా అని ఎదురుచూసిన ఆనం సోదరులు… పార్టీ పటిష్టత కోసం పని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు… నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదనే విషయాన్ని ఆ జిల్లా నాయకుల దృష్టికి అనేకసార్లు తీసుకొచ్చారు. ఈ విషయంలో ఆయన జిల్లా నాయకులను చాలాసార్లు మందలించారనే టాక్ ఉంది. అదే సమయంలో పార్టీ పటిష్టత కోసం పెద్దగా కృషి చేసిన ఆనం సోదరులకు పదవులు ఇచ్చే విషయంలోనూ ఆయన అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే తమకు చంద్రబాబు కావాలనే పదవులు ఇవ్వడం లేదని భావించిన ఆనం సోదరుల్లో ముఖ్యుడైన ఆనం రామనారాయణరెడ్డి… వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆనం వివేకానందరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో ఆనం ఫ్యామిలీ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.

నిజానికి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు చాలామంది రాజకీయాల గురించి పెద్దగా ఆలోచించరు. కానీ ఆనం కుటుంబం మాత్రం ఇలాంటి సమయంలోనే పార్టీ మారడం సంచలనం రేపుతుంది. అయితే అది జిల్లానుండి వైసీపీలోకి మరొక తెలుగుదేశం కీలక నేత ఆదాల ప్రభాకరరెడ్డి చేరుతున్నట్లు సమచారం . టీడీపీ నేతలు ఆదాల ప్రభాకరరెడ్డి పార్టీ మారకుండా ఉండటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికి తగ్గడం లేదని తెలుస్తుంది. మరోపక్క ఎవరు అవునన్నా,కాదన్నా ఆనం కుటుంభానికి నెల్లూరు జిల్లాలొ కొంత పట్టుంది…ఆదాల ప్రభాకరరెడ్డి ఆర్ధికంగా బలవంతుడు.ఇద్దరి చేరికతొ వైసీపీ నెల్లూరును క్లీన్ స్వీప్ చెయ్యటం గ్యారంటి అంటున్నారు సీనియర్ రాజకీయ నేతలు.వీళ్ళ చేరికతొ ఇతర నాయకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగన్ గారు చర్యలు తీసుకున్నారు.ఒకరి నియోజకవర్గంలొ మరొకరు వేలు పెట్టకూడదని ఒప్పందానికి కట్టుబడి వైసీపీలో రావటం పార్టికి శుభపరిణామం అంటున్నారు వైసీపీ అభిమానులు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat