నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..! – Dharuvu
Breaking News
Home / SLIDER / నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..!

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..!

పట్టాదార్ పాస్‌పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ఇవాళ ( శనివారం ఏప్రిల్-21) కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు . ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు.

పాస్‌ పుస్తకాలు, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని ఏవిధంగా పంపిణీ జరుగాలనేదానిపై కూలంకషంగా చర్చించనున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖల ఉన్నతాధికారులతోపాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్లు పాల్గొంటారు.

పాస్‌ పుస్తకాలు, చెక్కుల ముద్రణను వీలైనంత త్వరగా పూర్తిచేసి, మే 9 నాటికి గ్రామాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు 25 లక్షల పాస్‌పుస్తకాలు ఆయా జిల్లాలకు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్‌ పుస్తకాలతో పాటు రైతుబంధు చెక్కులను మే 10 నుంచి పంపిణీ చేయనున్నారు.