పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్ – Dharuvu
Home / ANDHRAPRADESH / పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్

పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్

ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయన తనయుడు నారా లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పంచించి కౌంటర్ ఇచ్చారు.. ” పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ ఎవరో చెపితే అన్నానన్నారు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం. ఎవరో అన్న, విన్న మాటల ఆధారంగా ఆరోపణలు చేసే కుసంస్కారిని కాదు.వాస్తవాలన్నిటినీ కాలమే ప్రజల ముందు ఉంచుతుంది. మీ పట్ల నా హృదయంలో గౌరవ స్థానమే ఉంటుంది. మాతృదేవోభవ ” అని లోకేష్ పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు.