మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ …! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ …!

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్ …!

మీరు మద్యం త్రాగుతారా.. అంటే అలవాటుగా కాకపోయిన అప్పుడప్పుడు త్రాగే అలవాటు అయినా ఉందా ..లేదా డైలీ అది త్రాగకపోతే అసలు నిద్రే పట్టదా ..అయితే ఈ వార్త మీకోసమే ..అసలు విషయానికి వస్తే ఏపీలో ఈ నెల 25వ తారీఖున నుండి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి .

చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏపీలో మద్యం వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు .తమకిచ్చే ట్రేడ్ మార్జిన్ ను పదహారు శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు .

ఇప్పటివరకు షాపులలో బార్లలో ఉన్న సరుకు అయిపోయిన వెంటనే అమ్మకాలు నిలిచిపోనున్నాయి అని ఏపీ రాష్ట్ర వైన్ డీలర్స్ అసోసియేషన్ విజయవాడలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు ..