Home / ANDHRAPRADESH / టీవీ9 అధినేత రవిప్రకాష్ కు పవన్ షాకింగ్ మెసేజ్..!

టీవీ9 అధినేత రవిప్రకాష్ కు పవన్ షాకింగ్ మెసేజ్..!

తనను దూషించిన  నటి శ్రీరెడ్డి వీడియోను పదే పదే చూపించి, డిబేట్లు నిర్వహించారని టీవీ9 న్యూస్‌ ఛానెల్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మండిపడుతోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీవీ 9 అధినేత రవి ప్రకాష్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్లు చేస్తున్నారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ అంటూ ట్వీట్‌ చేసిన పవన్‌ .. ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. అందులో రవి ప్రకాశ్‌ కారు వద్ద నిలబడి ఉండగా, ఓ సామాన్య వ్యక్తి వచ్చి రవిప్రకాష్ కాళ్లు మొక్కించుకుంటున్నట్లుగా ఉన్న వీడియోను పోస్ట్ చేశాడు.. అంతేకాకుండాఈ వీడియోను టీవీ9 9PM షోలో వేసే దమ్ముందా..? అంటూ టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ కు సవాల్ విసిరారు.

see also :

నేడు సంచలన ప్రకటన చేయనున్న వైఎస్ జగన్..!!

మరో ట్వీట్ లో..

రవి ప్రకాశ్.. నేను మీకు ప్రత్యేకంగా ఓ మెసేజ్ పంపుతాను. కొద్ది సమయం నాకు ఇవ్వమని అడుగుతున్నాను. నా మెసేజ్ కోసం మీరు వేచి చూడాల్సిందే. మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టినందుకు క్షమించండి అని పవన్ ట్వీట్ చేశారు.

see also :

బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌న్‌ఫై మ‌రో కేసు కొట్టేసిన హైకోర్టు..!!

టీవీ9 శ్రీనిరాజుకు ఓ వీడియోను ట్యాగ్ చేసి పవన్ చురకలంటించారు. ఈ వీడియోను మీ తల్లికి, భార్యకు, చెల్లెలికి చూపించండి. అంతేకాకుండా ఆ వీడియో ద్వారా సాధించిన విజయాన్ని వారికి వివరించండి. కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఎలాంటి పనులు చేస్తున్నారో కూడా తెలియజేయండి అంటూ పవన్ మరో ట్వీట్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat