Home / POLITICS / మ‌రో కీల‌క స‌మావేశానికి మంత్రి కేటీఆర్‌..!!

మ‌రో కీల‌క స‌మావేశానికి మంత్రి కేటీఆర్‌..!!

తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తార‌క‌రామారావు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ సమావేశానికి హజరుకానున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో సౌత్ అప్రికాలోని జోహన్సెస్ బర్గ్ నగరంలో జరగనున్న ఇండియా- సౌత్ అప్రికా బిజినెస్ సమ్మిట్లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికాలోని భారత హైకమీషనర్ కార్యాలయంతోపాటు భారత్, దక్షిణాప్రికా దేశాల వ్యాపార వాణిజ్య శాఖలు, అక్కడి వాణిజ్య వర్గాలు కలిసి సంయుక్తంగా ఈసదస్సును నిర్వహిస్తున్నాయి.  ఈ సమావేశంలో భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు సైతం హజరుకానున్నారు.

సౌత్ అప్రికాలోని పలువురు కీలక కంపెనీల సియివోలు, చైర్మన్లు, అక్కడి ప్రముఖ రాజకీయ నాయకులు ఈ సమావేశానికి హజరవుతున్నారు. ఈ సమావేశంలో స్టార్ట్ అప్ ఇండియా-స్టార్ట్ అప్ ఇకోసిస్టమ్ ఇన్ ఇండియా, భారతదేశంలో అటోమోటివ్ మరియు అటోమోబైల్ పరిశ్రమ, హెల్త్ కేర్, ఫార్మ, పూడ్ ప్రాసెసింగ్, మహిళా జౌత్సాహిక పారిశ్రామిక వేత్తలకు దేశంలో ఉన్న అవకాశాలు అనే అంశాలపైన ఈ సమ్మిట్లో చర్చిస్తారు. ఈ రంగాల్లో తెలంగాణ రాష్ర్టంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించాల్సిందిగా నిర్వహాకులు మంత్రికి పంపిన ఆహ్వానంలో కోరారు. దక్షిణాప్రికా, భారత్ల మద్య వ్యాపార వాణిజ్య సంబందాలను మరింతగా బలోపేతం చేసే ఈ సదస్సులో పాల్గోనడం, ద్వారా అక్కడి పెట్టుబడిదారులకు, సంస్ధలకు తెలంగాణ రాష్ర్టాన్ని పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి కే తార‌క‌ రామారావు తెలిపారు. ముఖ్యంగా పూడ్ ప్రాసెసింగ్, స్టార్ట్ అప్ ఈకో సిస్టమ్ లో టిహబ్, విహబ్ ద్వారా ఏ విధంగా దేశంలోనే అత్యుత్తమ స్థానంలో తెలంగాణ రాష్ర్టం ఉందో తెలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat