Home / SLIDER / హరీష్ రావు కౌంటర్కి టీ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ ..!

హరీష్ రావు కౌంటర్కి టీ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ ..!

తెలంగాణ రాష్ట్ర స‌మితిపై అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రి హ‌రీశ్ రావు ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. టీఆర్ఎస్ జెండా ఏంటో.అజెండా ఏంటో మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను  మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోతే ఆ పార్టీలన్నీ బీజేపీకి అనుకూలమన్నట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోంద‌ని ఆయన మండిప‌డ్డారు. సోమవారం నాడు సంగారెడ్డిలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేస్తోంద‌ని ఆరోపించారు. మోడీని దించడానికో రాహుల్ ను ఎక్కించడానికో టీఆర్ఎస్ పార్టీ పనిచేయదన్నారు.
టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇండస్ట్రియల్, ఐటీ సెక్టార్ లో సబ్సిడీ, టాక్స్ మినహాయింపులను ఇవ్వాల్సి ఉండగా వీటి పై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడరని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇలాంటి అంశాల‌పై స్పందించ‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డం ముందున్నార‌ని ఆరోపించారు.రైతు బంధు పథకం కింద ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు 750 కోట్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ  హెలికాప్టర్ లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రైతు బంధు చెక్కులు పంపిణీ చేస్తారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లా లో చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ని ఆహ్వానిస్తామని హరీశ్ రావు తెలిపారు. కేసిఆర్ ప్రతి అడుగు, మాట, శ్వాస రైతు వైపే నని ఆయన అన్నారు.పంట పెట్టుబడి వద్దనుకునే వాళ్లు స్వచ్ఛందంగా వదులుకోవచ్చునని సూచించారు.
‘గివిట్ అప్’ ద్వారా వదులుకున్న పంట పెట్టుబడిని తిరిగి రైతు సమన్వయ సమితి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు.ఈ డబ్బును ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు.  రెవెన్యూ విలేజ్ ఆధారంగా చెక్కుల పంపిణీ జరుగుతుందని హరీశ్ రావు తెలిపారు. ఏ ఊరిలో నైనా ఒకే రోజులో చెక్కులు పంపిణీ పూర్తి చేయాలని కోరారు.గ్రామాల్లో ఉండే వృద్ధులు, వికలాంగులకు ఇంటి దగ్గరికి వెళ్లి చెక్కులివ్వాలని ఆయన ఆదేశించారు.రైతు సమన్వయ సమితి సభ్యులు, ప్రజా ప్రతినిధులు రైతులకు భోజన వసతి కల్పిస్తే బాగుంటుందని హరీశ్ రావు సూచించారు.
యావద్దేశం తెలంగాణ దగ్గర నేర్చుకునే విధంగా క్రమశిక్షణతో చెక్కులు పంచాలని కోరారు.ఎవరి పేరిట చెక్కులుంటే వాళ్లే చెక్కులు తీసుకోవాలని రైతులని కోరారు.పంట వేసినా, వేయక పోయినా మొదటి సారి అందరికి చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. పంట వేయని వారి గురించి తరువాత ఆలోచిస్తామని చెప్పారు. చెక్కు తీసుకున్న 90 రోజుల్లో డబ్బులు తీసుకోకుంటే వాళ్లకు పంట పెట్టుబడి అవసరం లేదని భావిస్తామని కూడా మంత్రి అన్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రయోత్మకంగా ‘ధరణీ’ కార్యక్రమం మే 20 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.మే 30న ప్రతి మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat