ఆ ఆలయంలో ప్రసాదంగా ఏమిస్తున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. – Dharuvu
Breaking News
Home / BAKTHI / ఆ ఆలయంలో ప్రసాదంగా ఏమిస్తున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

ఆ ఆలయంలో ప్రసాదంగా ఏమిస్తున్నారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

తెలుగువారి సాంప్రదాయం ప్రకారం సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.నైవేద్యం అనంతరం అందులో కొంత ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తారు.లడ్డూ, పులిహోర, పరమాన్నం, చక్కెర పొంగళి వంటివి ఇస్తుంటారు.

అయితే తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పడప్పయీలో ఉన్న జైదుర్గా గుడిలో మాత్రం భక్తులు ఊహించనివాటిని ప్రసాదంగా అందిస్తున్నారు. అక్కడికి భక్తులకు రోజూ బర్గర్, శాండ్‌విచ్‌ల‌ను ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు . అందుకే ఈ ఆలయాన్ని హైటెక్ టెంపుల్, అని ఫాస్ట్ ఫుడ్ టెంపుల్ అని భక్తులు అంటున్నారు.

ఈ ఆలయాన్ని స్థాపించిన హెర్బల్ ఆంకాలజిస్టు కే శ్రీధర్ మాట్లాడుతూ…‘నా అభిప్రాయంలో ప్రసాదం రూపంలో పవిత్రమైన ఏ ఆహారమైనా ఇవ్వవచ్చు. ఇలా ఇవ్వడం తప్పేమీ కాదు. ఈ మందిరంలో ప్రసాదంగా ఇచ్చే ఆహార పదార్థాలను ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తారు. ఈ ప్రసాదాల ప్యాకెట్లపై ఎక్స్‌పైరీ డేట్ కూడా ముద్రిస్తారు. అని ఆయన తెలిపారు.