Home / ANDHRAPRADESH / న‌వ్వులే.. న‌వ్వులు..!!

న‌వ్వులే.. న‌వ్వులు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి దాదాపు సంవ‌త్స‌రం దాటి పోయింది. ఈ సంవ‌త్స‌రంలో నారా లోకేష్ ఏపీ మంత్రి వ‌ర్గం కేబినేట్‌పై త‌న‌కు ప‌ట్టు ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డేలా హైప్ క్రియేట్ చేసుకోవ‌డ‌మే త‌ప్ప .. సాధించింది శూన్యమ‌నే విష‌యం జ‌గ‌మెరిగిన స‌త్యం. అంతేకాక‌, మంత్రి నారా లోకేష్‌కు ఉన్నంత బ‌ద్ధ‌కం దేశంలోని ఏ నాయ‌కుడికి ఉండ‌ద‌న్న‌ది.. లోకేష్ సోష‌ల్ మీడియాలో పెట్టే మెసేజ్‌ల‌ను బ‌ట్టి ఇట్టే అర్థ‌మ‌వుతుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

అయితే, అయ్యా.. మంత్రిగారు మా ఊరిలో స‌మ‌స్య ఉందంటూ నెటిజ‌న్లు పెట్టిన స‌మ‌స్య‌కు మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరు చూస్తే న‌వ్వులు ఆగ‌వు..

ఇంత‌కీ నెటిజ‌న్లు మంత్రి లోకేష్‌కు విన్న‌వించుకున్న స‌మ‌స్య‌లేమిటి..? అందుకు మంత్రి నారా లోకేష్ పెట్టిన రీ ట్వీట్లు ఏమిట‌న్న‌వేగా మీ డౌట్‌..

ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్న గుంటూరు జిల్లా అచ్చెంపేట‌కు చెందిన ఎంవీ రావు అనే ఆయ‌న నారా లోకేష్‌కు ట్వీట్ చేస్తూ.. సార్ మీకు ఎలాంటి ట్వీట్ పెట్టినా సాల్వ్ చేస్తామ‌ని చెప్పారు.. మాకు మూడు సంవ‌త్స‌రాలు నుంచి సీసీ రోడ్లు ఉన్నాయి.. వేల కిలోమీట‌ర్లు రోడ్లు అంటూ ప‌లు మీడియా ఛానెళ్ల వారు చెప్ప‌డం విన్నాను.. అయితే, నిజానికి మా ఊరిలో 80 శాతం వ‌రకు ఉన్న‌వి మ‌ట్టి రోడ్లే అంటూ.. ఎంవీ రావు ఆయ‌న చెరుకుపాళెం గ్రామానిక సంబంధించిన ఫోటోల‌ను నారా లోకేష్ ట్వీట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అది కూడా నేను ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేసి సంవ‌త్స‌రం అయింది అంటూ పేర్కొన్నాడు. అంటే రావు త‌న గ్రామానికి సంబంధించిన స‌మ‌స్య‌ను ఏప్రిల్ 25, 2017న లోకేష్ ట్వీట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీనికి ఏప్రిల్ 25, 2018న‌, అంటే సంవ‌త్స‌రం త‌రువాత స్పందించిన నారా లోకేష్ మై సిన్సియ‌ర్ అపాల‌జీస్ అంటూ స్పందించి.. త్వ‌ర‌లో మీ గ్రామానికి అధికారులు పంపించి రోడ్ల‌కు సంబంధించిన ఎస్టిమేట్‌ను వేయ‌మ‌ని ఆదేశాలు జారీ చేస్తామ‌ని చెప్పారు.

అదే విధంగా నారాయ‌ణ‌రెడ్డి అనే ఆయ‌న.. సార్ మా గ్రామాంలో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు 16 సార్లు ట్వీట్ చేశాను. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేదు మీరు అంటూ ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో స్పందించిన మంత్రి నారా లోకేష్. ఎంవీ రావుకు చెప్పిన‌ట్టే నారాయ‌ణ‌రెడ్డికి కూడా.. మై సిన్సియ‌ర్ అపాల‌జీస్.. మీ గ్రామ స‌మ‌స్య‌ను నా దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెబుతూ.. అధికారుల‌ను పంపుతామ‌ని రిప్లై ఇచ్చారు.

 

 

అలాగే, వెంక‌ట్ కూచిపూడి, కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు మూడు కిలోట‌ర్లు ఉండే మా ఊరికి స్ర్టీట్ లైట్లు వెల‌గ‌డం లేదు.. ముఖ్య‌మంత్రి గారు.. గ‌తంలో మాట్లాడుతూ.. .. ఎక్క‌డ స్ర్టీట్ లైల్ వెల‌గ‌క‌పోయినా.. డాష్ బోర్డులో కిన‌పిస్తుందంటారు క‌దా.. మా స్ర్టీట్ లైట్లు క‌నిపించ‌డ‌లేదా..? అంటూ మంత్రి నారా లోకేష్‌ను ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat