జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ? – Dharuvu
Home / ANDHRAPRADESH / జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?

జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తన పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఒక మాట అన్నారు – నా యాత్ర ముగుసేలోపు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీఠం కదిలిస్తాను అని. అప్పట్లో ఆ మాటాను ఎవరు సీరియస్ గా తీసుకొలేదు..అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేయడం ఏమిటి ..అందుకు చంద్రబాబు పీఠం కదలటం ఎమిటి ?..అసలు ఈ రెండిటికి లింకు ఎక్కడా అని పెదవి విరిచారు అంతా .

కాని ఇప్పుడు తాజాగా నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే నాడు జగన్ చెప్పిన మాట నిజమైనట్లే కనిపిస్తుంది.జగన్ పాదయాత్ర మద్యలో సమయం చూసి రేపిన ప్రత్యక హోదా ఆందొళన, వైసీపీ ఎంపీల రాజీనామ , ఆ పై వారి దీక్ష వంటివి ప్రత్యక హొదా ఏమైనా సంజీవినా అని అన్న ముఖ్యమంత్రి హోదా లో ఉన్న చంద్రబాబు మీద తీవ్ర వత్తిడి పెంచాయి..అంతే కాకుండా ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలలొ తీవ్రమైన వ్యతిరేకత రావటంతో తప్పక బీజేపీతో మిత్ర బంధం తెంచుకుంటునట్లు చెప్పారు బాబు .దాదాపు నాలుగు ఏళ్ళ పాటు అధికారాన్ని అనుభవించిన కానీ పొత్తు నుండి విడిపొక తప్పలేదు ..

అంతే కాకుండా ఆఖరికి ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతో టీడీపీ తరపున కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు రాజీనామా చేయక తప్పలేదు..అంతే కాదు ఏకంగా తన పుట్టిన రోజు నాడు ఒక్కరోజు దీక్ష పేరిట చంద్రబాబు నాయుడు కూర్చొక తప్పలేదు. ప్రత్యక హొదా వలన ఏమి వస్తాయి అని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షి గా బొంకిన ఆయనే ఈ రోజు తిరుపతి ఎస్వీ విద్యాలయంలో ప్రత్యేక హోదా అంటు కార్యక్రమం చేస్తున్నారు ..ప్రస్తుతం కళ్ళముందు జరుగుతున్నా ఈ తాజా పరిణామాలు అన్ని చంద్రబాబు మీద పెరిగిన తీవ్ర వత్తిడికి సంకేతాలు అనటంలో మారు మాట లేదు.

పీఠం కదలటం అంటే ముఖ్యమంత్రి పదవి ఊడటం కాదు కూర్చున్న కుర్చిలో నుండి ప్రజల ఆకాంక్ష వైపు పరిగెత్తేలా చేయటం పాదయాత్ర సమయంలో జగన్ చెప్పినట్టే తన మాట నిలబెట్టుకున్నారు. ఒక మాట అంటు చెప్తే ఆ మాట అమలు అవ్వటానికి తన పదునైన వ్యూహాలతో రాజకీయ చాతుర్యం చూపేవాడే నాయకుడు ..ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న పట్టనట్టు ఉన్న బాబుని అదే ప్రజల కొసం కదిలే లా చెస్తా అని మాట చెప్పి మరీ తన వ్యుహం అమలు చేసి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న బాబు పీఠం కదిలే లా చేశారు జగన్ … ఈ సంఘటనతో ప్రజానాయకుడిగా ఇంకో మెట్టు ఎక్కెసారు జగన్..