దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న సీఎం కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్-29) చెన్నై పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండో రోజు సోమవారం (ఏప్రిల్-30) కూడా చెన్నైలో కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ITC చోళ హోటల్ లో కేసీఆర్ తో DMK ఎంపీ కనిమొళి భేటీ అయ్యారు. మంత్రులు కేకే, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమావేశంలో ఉన్నారు. దేశ రాజకీయాలు, చెన్నై పర్యటన ఉద్దేశాలపై చర్చించనున్నారు.