ఉదయాన్నే అరటిపండును తినచ్చా..? – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / ఉదయాన్నే అరటిపండును తినచ్చా..?

ఉదయాన్నే అరటిపండును తినచ్చా..?

ఉదయాన్నే మనం తీసుకునే అల్ఫాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమత్యుల పరిచి ,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.అయితే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకునే అల్ఫాహారం విషయంలో ఆశ్రద్దను కనపరుస్తున్నారు.మనలో చాలా మంది ఉదయం అల్పాహారానికి బదులు ఒకటో రెండో అరటి పండ్లతో సరిపెడుతున్నారు.అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకుంటూ ఉంటారు.అయితే ఖాళీ కడుపుతో అరటిపడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమంతా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అరటిపండులో పోటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండును తినడం వలన ఇది శరీరంలోని మినరల్స్ స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది.అందువల్ల ఉదయాన్నే అరటిపండు తినడం మానివేయడం చాలా ఉత్తమం.

అరటిపండు అనేది చాలా మంచి అల్ఫాహారం.ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు,అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది.అలసట ,మలబద్దకం,కడుపులో ఏర్పడే అల్సర్ వంటి సమస్యలను తగ్గించడంతో పాటు ,రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి ని పెంచుతుంది.అయితే ఈ పోషక ప్రయోజనాలు అన్ని పొందాలంటే ,మీరు సరైన సమయంలోనే అరటిపండును తినడం మంచిది.ఖాళీ కడుపుతో తినడం వలన కడుపులో అమ్లత్వమునకు దారి తీసి పేగు సమస్యను తీవ్ర తరం చేసే అవకాశం ఉంది.ఖాళీ కడుపుతో అరటిపండును తినడం వలన మీలో ఉన్న చురుకుదనాన్ని తగ్గించి నిద్రావస్థ అనుభూతిని కలిగిస్తుంది.

అరటిపండు ఎక్కువ మొత్తంలో చక్కెర నిల్వలను కలిగి ఉంటుంది.ఇది శరీరంలోని శక్తిని ప్రేరేపిస్తుంది.అయితే ఖాళీ కడుపుతో అరటిపండును తినడం వలన కొన్ని గంటల వ్యవధిలోనే పొందిన శక్తి క్రమంగా క్షినించి పోతుంది.అందువల్ల అరటిపండును ఇతర అల్ఫాహారాలతో కలిపి తీసుకుంటే చాలా మంచిది.