హ్యట్సాఫ్…తోటమాలి పెళ్లికి హజరైన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరమ్మ – Dharuvu
Breaking News
Home / EDITORIAL / హ్యట్సాఫ్…తోటమాలి పెళ్లికి హజరైన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరమ్మ

హ్యట్సాఫ్…తోటమాలి పెళ్లికి హజరైన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరమ్మ

ఆమె ఓ జిల్లా కలెక్టర్..ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం.సాధారణంగా డబ్బు, హోదా, అధికారాలను చూసుకుని చాలా మంది మిడిసి పోతుంటారు. కానీ కొందరు అందుకు భిన్నంగా ఎంత పెద్ద స్థాయిలో వున్నప్పటికీ సామాన్య మనుషుల పట్ల ప్రేమ కలిగి వుంటారు. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అక్కడో ఎక్కడో అలాంటి సహృదయులు వుంటారు. అలాంటి సహృదయత కలిగిన కలెక్టరమ్మే ఈమె.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అయిన దివ్యదేవరాజన్ ఓ వివాహానికి హాజరైయ్యారు. దీంతో ఆ పెళ్లికి వచ్చిన అతిథుల ముఖాల్లో ఆనందం వెలిగిపోయింది.ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది అంటే … కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తోటమాలిగా పని చేస్తున్న ఆదివాసీ యువకుడు సుధాకర్ వివాహ వేడుక మండలంలోని గోపాల్‌పూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది.

ఈ పెళ్లికి కలెక్టర్ దివ్యదేవరాజన్ హజరై ఆదివాసీ వివాహం జరుగుతుండగా కలెక్టర్ ఆదివాసీ మహిళలతో కలిసి నేలపై కూర్చొని ఆ వేడుకను చూశారు. ఆదివాసీ సంప్రదాయం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా  మహిళలతో కలిసి థింసా నృత్యాలు చేశారు . జిల్లా కలెక్టర్‌ వివాహ వేడుకకు హాజరు కావడంతో పెళ్లింటి వారు, బంధుమిత్రులు, గ్రామస్థుల ఆనందానికి అవధులు లేవు..