ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుడు శృంగారం చేయకూడదు..వీలైతే మధ్యమధ్యలో – Dharuvu
Breaking News
Home / LIFE STYLE / ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుడు శృంగారం చేయకూడదు..వీలైతే మధ్యమధ్యలో

ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పుడు శృంగారం చేయకూడదు..వీలైతే మధ్యమధ్యలో

శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. శృంగారం అనేది ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు. కేవలం భావప్రాప్తి కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. రోజూ శృంగారం చేయడం వలన మనం ఊహించని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలామంది జంటలకు భోజనం చేసిన వెంటనే రతి క్రియలో పాల్గొంటే ఏమవుతుందన్న అనుమానం వుంటుంది. భోజనం చేసిన వెంటనే శృంగారం చేయడం కామసూత్రానికి విరుద్ధం. రతి క్రియకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. అవి ఇవే..ఎట్టి పరిస్థితుల్లోనూ పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలనేది వైద్యుల సలహా. సూర్యోదయం అవుతుండగా రతిక్రియ చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. కొందరు రాత్రి 7 గంటలకే భోజనాన్ని ముగిస్తారు. ఇలాంటి వారు రాత్రి 10 గంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెపుతున్నారు. రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్థరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి. నిద్రకు ఉపక్రమించే ముందు పాలు సేవించకూడదు. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు సేవించాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.