రాత్రి పుట నిద్ర సరిగ్గా ప‌ట్ట‌డం లేదా..? ఇలా చేయండి..! – Dharuvu
Home / LIFE STYLE / రాత్రి పుట నిద్ర సరిగ్గా ప‌ట్ట‌డం లేదా..? ఇలా చేయండి..!

రాత్రి పుట నిద్ర సరిగ్గా ప‌ట్ట‌డం లేదా..? ఇలా చేయండి..!

నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, అనారోగ్యాలు… తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి రోజూ నిద్ర సరిగ్గా పట్టడం లేదు. దీంతో వారు రోజూ యాక్టివ్‌గా ఉండలేక‌పోతున్నారు. స‌రిగ్గా పనిచేయలేక‌పోతున్నారు. దీంతో నిద్ర‌లేమి వ‌ల్ల‌ డిప్రెషన్ బారిన కూడా ప‌డుతున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండాలంటే కింద ఇచ్చిన పలు సూచ‌న‌లు పాటిస్తే నిద్రలేమి స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. దీంతో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • రోజూ రాత్రి కొన్ని చెర్రీ పండ్లను తింటే చాలు. నిద్ర చక్కగా పడుతుంది.
  • ప్రతి రోజూ రాత్రి గోరు వెచ్చని పాలను తాగినా నిద్ర బాగా పడుతుంది. పాలలో న్యూరో ట్రాన్స్‌మీటర్స్ ఉంటాయి. ఇవి చక్కని నిద్ర వచ్చేలా చేస్తాయి.
  • రాత్రి పూట భోజనంలో పెరుగు లేదా మజ్జిగను తీసుకున్నా దాంతో నిద్ర బాగా పడుతుంది.

  • అరటి పండ్లను రాత్రి పూట ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు, ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి.
  • చేపల్లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు నిద్ర బాగా వచ్చేలా చేస్తుంది. వారంలో కనీసం 3 సార్లు రాత్రి భోజనంలో చేపలను తింటూ ఉంటే తద్వారా నిద్ర సమస్యలు పోతాయి.
  • రోజూ రాత్రి గ్రీన్ టీ తాగినా హాయిగా నిద్రపోవచ్చు. గ్రీన్ టీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది.దీంతోపాటు చక్కని నిద్ర వస్తుంది.