ముఖేష్ అంబానీకి కాబోయే అల్లుడెవరో తెలుసా..? – Dharuvu
Home / BUSINESS / ముఖేష్ అంబానీకి కాబోయే అల్లుడెవరో తెలుసా..?

ముఖేష్ అంబానీకి కాబోయే అల్లుడెవరో తెలుసా..?

ప్రముఖ వ్యాపారవేత్త , రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ఓ గుడిలో జరిగింది. ఇంతకీ ముఖేష్ అంబానీ అల్లుడు ఎవరనుకుంటున్నారా..? అయన ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్.పిరమల్ రియాలిటీ అనే ఓ దేశంలోకెల్లా అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకదానికి ఫౌండర్.ఈ రియల్ కంపెనీకన్నా ముందు పిరమల్ స్వాస్థ్య అనే ఓ కంపెనీ వాళ్ళకు ఉండేది. రోజుకు 40 వేల మంది రోగులకు చికిత్స అందించే ఓ పెద్ద కంపెనీ.దాంట్లో ఈ ఆనంద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. చదుపులు కూడా బాగా చదువుకున్నాడు… పెన్సిల్వేనియా (అమెరికా) యూనివర్శిటీలో ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేట్, తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశాడు ఆనంద్.అయితే ఇషా , ఆనంద్ పిరమల్మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఉంగరాలు మార్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Isha Ambani Gets Engaged With Anand Piramal - Sakshi

ఎప్పటినుండో ఆనంద్‌, ఇషాలు మంచి స్నేహితులు. కొద్దిరోజుల క్రితం మహాబలేశ్వరంలోని ఓ గుడిలో ఆనంద్‌, ఇషాకు ప్రపోజ్‌ చేశారు. ఇషా కూడా అంగీకారం తెలపడంతో అక్కడే ఉంగరాలు మార్చుకున్నారు. ఆ తర్వాత వారి వారి కుటుంబాలకు విషయం చెప్పారు. ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతాల మ్యారేజ్ కంటే ముందే ఆనంద్‌, ఇషాల వివాహం జరుగుతుందని తెలిసింది. అయితే..పెళ్లి తేదీ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు.

ఆనంద్‌ భారత్‌లో పిరామల్‌ ఈ-స్వాస్థ్య, పిరామల్‌ రియాల్టీ అనే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు. ఇషా రిలయన్స్ జియో, రిలయన్స్‌ రిటైల్‌ బోర్డుల్లో సభ్యురాలిగా ఉన్నారు.