ఢిల్లీపై బెంగ‌ళూరు ఘన విజ‌యం..!! – Dharuvu
Home / SLIDER / ఢిల్లీపై బెంగ‌ళూరు ఘన విజ‌యం..!!

ఢిల్లీపై బెంగ‌ళూరు ఘన విజ‌యం..!!

ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ – 2018లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం వేదిక‌గా శనివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది.అయితే మొదటగా టాస్ గెలిచిన బెంగ‌ళూరు జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు చేసింది.

కాగా, 182 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఇంకా ఒక ఓవ‌ర్ మిగిలి ఉండ‌గానే (19వ ఓవ‌ర్ల‌లో) ఐదు వికెట్లు కోల్పోయి 187 ప‌రుగులు చేసింది. దీంతో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జ‌ట్టుపై రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఘన  విజ‌యం సాధించింది.