రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!! – Dharuvu
Home / LIFE STYLE / రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..!!

రైలు ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ మరో శుభవార్త అందించింది.త్వరలోనే విమానాల్లో ప్రయాణికులకు ఏవిధంగానైతే ఆహారాన్ని అందిస్తారో..రైల్వే ప్రయాణికులకు కూడా అదే తరహాలో నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నట్లు తెలిపింది.అందులో భాగంగానే భోజన మెనూ స్వరూపంలోనూ సమూల మార్పులు తేనుంది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లొహాని ఈ విషయాన్ని తెలిపారు.

రైలు ప్రయాణికులకు అందించే ఆహారం విషయంలో నాణ్యతను పాటించడంతోపాటు, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసి ఆహార పదార్ధాల తయారీలో అక్రమాలకు చెక్ పెట్టనున్నట్లు ఆయన చెప్పారు .రైల్వే ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యత, రుచి విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. జులై 1 నుంచి అన్ని ప్రీమియం రైళ్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు.