ప్యానాసోనిక్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 3999కే.. – Dharuvu
Home / SLIDER / ప్యానాసోనిక్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 3999కే..

ప్యానాసోనిక్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 3999కే..

ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ ప్యానా సోనిక్ ఇండియా కంపెనీ సరికొత్తగా పి95 పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర కేవలం రూ.3,999. ఈ ఫోన్ లో ఫేస్ అన్ లాక్, వాయిస్ రికగ్నిషన్ వంటి అద్భుతమైన సదుపాయాలను కంపెనీ కల్పించింది .ఈ ఫోన్ గోల్డ్, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో లభిస్తుంది. మంచి డిజైన్, చక్కని పనితీరుతో ఈ ఫోన్ యూజర్ల అభిమానాన్ని చూరగొంటుందన్న అభిప్రాయాన్ని ప్యానాసోనిక్ ఇండియా మొబిలిటీ డివిజన్ బిజినెస్ హెడ్ పంకజ్ రాణా పేర్కొన్నారు.

Image result for panasonic P95

ఫీచర్లు

ఈ మొబైల్‌లో 5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే వుంటుంది.

1.3 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్

1జీబీ ర్యామ్

16జీబీ అంతర్గత స్టోరేజీ

128జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఎక్స్ పాండబుల్

2,600 ఎంఏహెచ్ బ్యాటరీ

8 మెగా పిక్సల్ రియర్ కెమెరా

5మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా

ఆండ్రాయిడ్ నౌగత్ 7.1.2 ఓఎస్ ఉన్నాయి.