Home / POLITICS / పేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీసిన కాలర్

పేస్ బుక్ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీసిన కాలర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అండగా రైతు బంధు పేరుతో ఎకరానికి 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై విమర్శలు చేస్తున్నది.అందులోభాగంగానే నిన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు.అయితే ఆ లైవ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఒక కాలర్ (దేవరాజ్ అనే వ్యక్తి ) నుండి అనుకోని ప్రశ్న ఎదురైంది.తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 4వేలు ఇస్తుంటే…కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తున్నదని ఆ కలర్ నిలదీశాడు.అందుకు ఉత్తమ్ కవర్ చేసుకోవడానికి ఎక్కడ వ్యతిరేకించామమ్మా? దానికి మద్దతే పలికాం కదా! తప్పనిసరి.
కాంగ్రెస్ పార్టీ సంతోషిస్తున్నది కదా! అంటూ..కవర్ చేసుకున్నారు ఉత్తమ్ .

ఫోన్‌కాల్‌లో సంభాషణ యథాతథంగా..

ఉత్తమ్: హలో చెప్పండి
దేవరాజ్: సార్ నేను దేవరాజు, దుబ్బాక నుంచి. నమస్తే.
ఉత్తమ్: దేవరాజ్ మిత్రమా చెప్పు!
దేవరాజ్: సార్ రూ.4 వేలు ఇచ్చే విషయంలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
ఉత్తమ్: ఎక్కడ వ్యతిరేకించామమ్మా? దానికి మద్దతే పలికాం కదా! తప్పనిసరి.
కాంగ్రెస్ పార్టీ సంతోషిస్తున్నది కదా!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat