శతక్కొట్టిన రాయుడు…చెన్నై సూపర్ విక్టరీ – Dharuvu
Breaking News
Home / SLIDER / శతక్కొట్టిన రాయుడు…చెన్నై సూపర్ విక్టరీ

శతక్కొట్టిన రాయుడు…చెన్నై సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2018 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి రుచి చూపింది.ఐపీఎల్ లో భాగంగా పూణే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఈ రోజు జరిగిన మ్యచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై..19 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి సునాయాసంగా విజయం సాధించింది. . 13 ఓవర్ల వరకూ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఓపెనర్లు అంబటి రాయుడు, వాట్సన్ 134 పరుగుల భాగస్వామ్యన్ని నమోదు చేశారు.