జూబ్లీహిల్స్ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌..మ‌త్తులో అమ్మాయి డ్రస్‌ మార్చుకొని..హ‌ల్ చ‌ల్ – Dharuvu
Home / CRIME / జూబ్లీహిల్స్ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌..మ‌త్తులో అమ్మాయి డ్రస్‌ మార్చుకొని..హ‌ల్ చ‌ల్

జూబ్లీహిల్స్ లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌..మ‌త్తులో అమ్మాయి డ్రస్‌ మార్చుకొని..హ‌ల్ చ‌ల్

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్థరాత్రి వేళ పోలీసులు ప్రత్యేక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు చేస్తున్నా….కేసులు బుక్‌ చేస్తున్నా…..అమ్మాయిలు దొరుకుతున్నారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని గమనించి…వాహనంలో డ్రైవర్‌ సీటులో నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు-45లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా ఓ యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

మద్యం బ్యాన్‌ చేయమంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఫుల్లుగా మద్యం కొట్టిన యువతి, తనిఖీలు విషయం తెలుసుకుని…పోలీసులకు ఆమాడదూరంగా కారును ఆపేసింది. మీడియాను చూసి డ్రైవర్‌ సీటులో నుంచి దిగి…ఎస్‌బీహెచ్‌ ఎటీఎంలోకి పరుగులు తీసింది. మందు కొట్టిన యువతి ఏటీఎం సెంటర్‌లో డ్రస్‌ మార్చుకొని…తాపీగా బయటకు వచ్చింది. పోలీసుల దగ్గరకు వచ్చే సరికి తాను డ్రైవర్‌ సీటులో లేనని బుకాయించింది. అయితే ఏటీఎం సెంటర్‌లోకి ఎందుకు పరుగులు పెట్టిందో మాత్రం చెప్పడం లేదు. తాము తనిఖీలు చేస్తున్న సమయంలో కారులో డ్రైవర్‌ ఉన్నాడని…యువతి డ్రైవింగ్ స్థానంలో లేకపోవడంతో టెస్ట్‌లు చేయలేదని చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు.