సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. మదర్స్ డే సందర్భంగా వెరైటీగా తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసి సర్ ఫ్రైజ్ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ట్విట్టర్ లో తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసిన కేటీఆర్.. హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ ట్విట్ చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి దిగిన చిన్న నాటి ఫోటోను పోస్ట్ చేసి.. ప్రపంచంలో అమ్మ ప్రేమకు ఏది సాటిరాదు అన్నారు. నేను నేడు ఈ స్థానంలో ఈ విధంగా ఉన్నానంటే అది మా అమ్మ వల్లే. నాకు తెలిసిన అత్యంత శక్తివంతమైన వ్యక్తి మా అమ్మే అని ట్వీట్ చేశారు కేటీఆర్.
The strongest person that I know, that person who shaped me into whatever I am today; my mother ?
Happy Mother’s Day Amma ? and to all the mothers in the world whose unconditional love is unmatched ? #Respect #MothersDay pic.twitter.com/UdCy23OUH0
— KTR (@KTRTRS) May 13, 2018
అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..చిన్నప్పుడు కేటీఆర్ గారు చాలా క్యూట్ గా ఉన్నారంటూ..మరికొందరు సీఎం కేసీఆర్ స్మార్ట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.