Home / ANDHRAPRADESH / ఏపీలో 20 వేల కోట్ల కుంభకోణం-అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీలో 20 వేల కోట్ల కుంభకోణం-అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఏపీ ఐటీ విభాగంలో మొత్తం ఇరవై వేల కోట్ల కుంభ కోణం జరిగిందని “ఒరై సాంబా, రాస్కో”అని నెటిజన్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వైరల్ చేశాడు .ఉన్నది ఉన్నట్లు మీకోసం ..ఒక్కసారి చదవండి ..”బాధ్యతగల ప్రతిపౌరుడు పూర్తిగా చదవండి , పదిమందికి తెలియచేయండి .

సీబీఐ ఎంక్వయిరీ వేస్తే తండ్రీకొడుకులు శాశ్వతంగా జైలుశిక్ష అనుభవించటం ఖాయం ..

ఆధారాలన్నిటినీ ఇప్పటికే పీఎంఓ ఆఫీస్ కి , సిబిఐ కి , సీవీసీ కి పంపాను .

హైదరాబాద్ ని నేనే కట్టాను , హైదరాబాద్ కి ఐటీ తెచ్చాను అలాగే అమరావతికి ఐటీ తెచ్చి ప్రపంచంలోనే నంబర్ వన్ చేస్తానని మొదటి రోజునుండే చంద్రబాబు పదే పదే గొప్పలు చెప్పుకొంటున్నారు .

ఐటీలో నంబర్ వన్ చేయటం పక్కనపెట్టి ఐటీ పేరుతొ వేల కోట్లు దోచుకొంటున్నారు . ఇలాంటి దోపిడీ భారతదేశ చరిత్రలోనే జరగలేదు . వాళ్ళ దోపిడీకి అనుకూలంగా ఐటీ పాలసీని తయారు చేశారు , దానికనుగుణంగానే ప్రభుత్వ జీవోలు జారీచేశారు .

–మొత్తం కుంభకోణం విలువ – 20 వేల కోట్లు పైమాటే .
— దోపిడీకి అనుకూలంగా ఐటీ పాలసీకి రూపకల్పన
— పాలసీకి అనుకూలంగా లోకేష్ బినామీ కంపెనీలకి అనుకూలంగా జీవోలు జారీ .
–జీవోలని ఆధారంగా చేసుకొని కంపెనీలకి స్థలాలు కేటాయింపు .
–జీవోలని అడ్డంపెట్టుకొని వేల కోట్లు ప్రోత్సాహకాల పేరుతొ కంపెనీలకి చెల్లింపు .
–ఒక్క డల్లాస్ లోనే చంద్రబాబు సమక్షంలో జరిగిన ఎంఓయూలు మొత్తం 26 .

మొత్తం వివరాలని సేకరించాను , కంపెనీల వివరాలు , జీవోలు వివరాలు , కంపీనీలకి స్థలం కేటాయింపులు , ప్రోత్సాహకాలు చెల్లింపులు అన్నీ వివరంగా దిగువున ఇస్తున్నాను చదవండి .

ప్రభుత్వ ప్రోత్సాహకాల పేరుతొ జీవోలు – కుంభకోణానికి బీజాలు
—————————————————————————

గత రెండు సంవత్సరాలుగా పెట్టుబడులు ఎంఓయూలు అంటూ లేని కంపెనీలని సృష్టించి , సొంతమనుషులతోనే తప్పుడు ఎంఓయూలు చేపిస్తూ గతేడాది 6 లక్షల కోట్లని , ఈఏడాది వైజాగ్లో 10 లక్షల కోట్లని ఎందుకు హడావుడి చేస్తున్నారు . దానివెనుక ఉన్న అసలు నిజాలు తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే .

*ఫోటోలు 1 నుండి 10 varaku mariyu 15,16,17 * GO.MS.No.1, G.O.RT.No.30,G.O.MS.No.17

ఈ రెండు జివోలని గతేడాది ఫిబ్రవరి లో విడుదల చేశారు . ఈజీవో ప్రకారం IT రంగంలో ప్రభుత్వ ప్రోత్సాహాకాలు ఎలా ఉండాలో , కంపెనీలకి ఉండాల్సిన అర్హతలు ఏమిటో వివరిస్తూ ఈ రెండు జీవోలు విడుదల చేశారు .

*ఫోటోలు 18 నుండి 24 వరకు **

G.O.MS.No.3 తేదీ – 16.03.2016
GO.Ms.No.13 తేదీ – 11.08.2014
GO.Ms.No.16. తేదీ – 09.09.2014

ఈ మొత్తం కుంభకోణానికి మూలాధారం ఈ జీవోలు . టీడీపీలోని గల్లీ నాయుకుడినుండి మంత్రుల వరకు , అనకాపల్లి నుండి అమెరికా దాకా ప్రతి పచ్చ కార్యకర్త ఎంఓయూ ల కోసం ఎగబడటం వెనుక ఉన్న అసలు కధ తెలియాలంటే ఈ జివోలని క్షుణ్ణంగా పరిశీలించాలి .

ఈ జీవోలు ప్రకారం ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకి దక్కబోయే ప్రోత్సాహకాలు ఒక్కసారి చూడండి .

1 . కంపెనీలో ఎంత మంది ఉద్యోగులు ఉంటే అంతమందికి ఒక్కో ఉద్యోగికి 1 లక్షా 75 వేలు చొప్పున ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తే అంతమొత్తం కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుంది .

అనగా మనం ఒక చిన్న కంపెనీ పెట్టి దానిలో పదిమందికి ఉద్యోగం ఇచ్చినట్లు చూపెడితే ప్రభుత్వం మనకి ప్రోత్సాహకం రూపంలో 17 లక్షలు చెల్లిస్తుంది .

2 . వందమందికి ఉద్యోగాలు ఇస్తామని చూపెడితే ఆకంపెనీకి ప్రభుత్వం ఎకరం పొలం ఇస్తుంది . దానిలో 3 సవత్సరంలలో నిర్మాణం పూర్తి చేసుకొని 100 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి .

ఈ మూడు సంవత్సరాలు నీ కంపెనీని ప్రైవేట్ భవనంలో నడుపుకుంటే కంపెనీ కి సంవత్సరానికి అద్దె తాలూకు ప్రభుత్వమే 10 లక్షలు ప్రోత్సాహకం రూపంలో ఇస్తుంది .

3 . కంపెనీకి అవసరమయ్యే బ్యాండ్ విడ్త్ , ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం సంవత్సరానికి మరో 15 లక్షలు ఇస్తుంది .

4 . కంపెనీకి అవసరమయ్యే కరెంటు ని ఒక్కో యూనిట్ కేవలం రూపాయికే ఇస్తుంది .

5 . కంపెనీ కనుక పేటెంట్ ఫైల్ చేస్తే దానికి మరో 5 లక్షల ప్రోత్సాహకం .

6 . కంపెనీలో పదిమందికి ఉద్యోగం ఇచ్చాక వాళ్లకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక్కో ఉద్యోగికి 10 వేలు ప్రభుత్వమే ఇస్తుంది .

7 . ఎలక్ట్రిసిటీ డ్యూటీ 100 % ఫ్రీ .
8 . స్టాంప్ డ్యూటీ , రిజిస్ట్రేషన్ ఫీజు 100 % ఫ్రీ .

9 . కంపెనీకి కేవలం పావలా వడ్డీకే కోటి రూపాయలు లోన్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది .
10 . కాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ( బిల్డింగ్ ప్లాన్ , మెషినరీ ) కోసం ఖర్చు చేసే దానిలో 10 % ప్రభుత్వమే తిరిగి కంపెనీకి ఇస్తుంది .

11 . వ్యాట్ , CST,GST, ఇంకా అనేకరకాల టాక్స్ లు 100 % ప్రీ .

ఇలా ఎన్నో రకాలుగా కొన్ని కోట్ల రూపాయలని ప్రోత్సాహకాలు పేరుతొ తెలుగు తమ్ముళ్ళకి దోచిపెట్టటానికే ఈ ఎంఓయూల నాటకానికి తెరలేపారు .

*ఫోటోలు 25 నుండి 29 వరకు *

GO.MS.No.21 – పైన పేర్కొన్న ప్రోత్సాహాకాలకి మరిన్ని అదనంగా జతచేస్తూ అంతకుముందు ఇచ్చిన జీవోలపై అమెండ్ మెంట్ జీవో , దీనిలో ఎలాంటి కంపెనీకి ఎన్ని ఎకరాల భూములు ఇవ్వాలో పేర్కొన్నారు .

పైన ఇచ్చిన ప్రోత్సాహకాల జివోలని అడ్డంపెట్టుకొని కుంభకోణానికి తెరతీసిన వైనం. మొట్ట మొదటగా మొన్న ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్ టన్ అనే కంపెనీ కోసం జారీచేసిన రెండు జీవోల వివరాలు ఆ కంపెనీకి కలిగిన లబ్ది చూడండి .

G.O.M.S.No : 2 Date :- 11/01/2018
G.O.M.S.No : 8 Date :- 30/04/2018

జీవో నంబర్ 2 ప్రకారం కంపెనీకి విశాఖపట్టణం రుషికొండలో అత్యంత ఖరీదుగల 40 ఎకరాలని 80 % రిబేట్ ధరకి కట్టబెట్టింది .

–80 % రిబేట్ ఇవ్వగా ఎకరా 32 లక్షలకి 40 ఎకరాలని కట్టబెట్టింది . అనగా అక్కడ ప్రభుత్వ విలువ ఎకరాకు 1 కోటి 60 లక్షలుగా లెక్కగట్టింది . ప్రభుత్వ రికార్డ్ ప్రకారమే అంత ఉందంటే బయట మార్కెట్ ధర షుమారుగా 10 కోట్లు పైమాటే . అనగా మొత్తం స్థలం విలువ 400 కోట్లు .
— మొత్తం 1000 ఉద్యోగాలు ఇస్తున్నట్లు చూపెట్టారు . ఒక్కో ఉద్యోగికి నెలకి లక్షా డెబ్భై వేలు ప్రభుత్వమే ప్రోత్సాహకాలు రూపంలో ఇస్తుంది . ( దానికి సంభందించిన జీవోలు ఫోటోలు 1 నుండి 10 వరకు , 15 నుండి 26 వరకు చూడండి ) .

–ఒక్కో ఉద్యోగికి నెలకి 175000 అంటే 1000 మందికి
175000 *1000 = 17 కోట్ల 50 లక్షలు ( ఒక నెలకి )
సంవత్సరానికి 210 కోట్లు .
మూడు సంవత్సరాలకి 630 కోట్లు
— ఇవి కాకుండా అదనపు ప్రోత్సాహకాలు ( అద్దెలు , కరెంట్ , ఇంటర్నెట్ ఆఫీస్ నిర్మాణంలో 50 % సబ్సిడీ ) అన్నీ కలుపుకొంటే మూడు సంవత్సరాలకి కలిపి మరొక 100 కోట్లు .

–పైవన్నీ కలుపుకొంటే 400 కోట్లు ( స్థలం )+ ప్రోత్సాహకాలు 730 కోట్లు = 1130 కోట్లు

అంటే ఒక్క ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్ టన్ కంపెనీకే 1130 కోట్లు దోచిపెట్టారు .

**గమనిక — 40 ఎకరాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోకి ఎమెండ్మెంట్ చేస్తూ మరొక జీవో ( జీవో నెం 8 ) ఇచ్చారు . దానిప్రకారం కంపెనీ ఎప్పుడైనా ఎత్తేసి వాళ్లకి కేటాయించిన స్థలం అమ్ముకోవచ్చు .

దానర్థం ఏమిటంటే ప్రోత్సాహకాలు ఉన్న ఈ మూడుసంవత్సరాలు కంపనీని నడిపి రేపు చంద్రబాబు దిగిపోతె స్థలం అమ్ముకొని అందరూ అమెరికాకి వెళ్లిపోవచ్చు .

*కొసమెరుపు*ఏమిటంటే ఈ ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్ టన్ కూడా ఫేకు కంపెనీలే . ఇక్కడ అమెరికాలో వాటి వివరాలు కనపడకుండా మాయం చేయారు . వీటి గురించి అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లలో కానీ లేదా కంపెనీ వివరాలు తెలిపే వెబ్సైట్లలో కూడా ఎక్కడా లేవు . మొదట్లో కొన్ని H1 అప్లికేషన్స్ తిరస్కరించినట్లు , అమెరికాలో కేసులుపెట్టి బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ఆధారాలు లభ్యం అయ్యాయి .

**ఫోటోలు 30 ,31 ,32 ,33 ,34 చూడండి .

 

డల్లాస్ లో ఎంఓయూలు
..
ఈ మొత్తం తంతంగం కోసం APNRT అనే సంస్థని నెలకొల్పి దానికి లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ ని చైర్మన్ గా చేసారు .

ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్ టన్ లాంటి ఫేకు కంపెనీలతో ( మొత్తం టీడీపీ అభిమానులవే , ఒకే వర్గానికి చెందినవి) గతేడాది డల్లాస్ లో చంద్రబాబుతో ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీల వివరాలు . వీటిలో చాలావరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు , కనీసం ఆఫీసులు కూడా లేవు . కొన్నిటికి ఆఫీస్ అడ్రస్ లు ఇచ్చారు కానీ అక్కడికెళ్తే కంపెనీ కార్యకలాపాలు ఏమీ లేవు , అసలు ఆ అడ్రస్ లో ఈ కంపెనీల ఆనవాళ్లే లేవు . కంపెనీల ఓనర్లు పేర్లు కూడా కొన్నిటిని సేకరించాను , అందరూ టీడీపీ అభిమానులే , ఇక్కడకి ఏ టీడీపీ నాయకుడు వచ్చినా కార్లకి జెండాలు కట్టి తిరిగేవాళ్లే . మొత్తం 26 కంపెనీల వివరాలు చూడండి .

1 . NEMO IT SOLUTION – bhaskar sunkara ,radhika velaga -texas-2007

2. ARCUS TECK KAT – ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు

3 . SRI TEK INC – ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు

4 . IDMTA INC ( శశి కేలం ) -555 N Point Center East Alpharetta, GA-2016

5 . CONCH TECH ( మధు మారీడు )2005,6750 Poplar Ave – Suite 711 Memphis, TN

6 . NOVISYN ( రాజేష్ పేరిచర్ల ) 2015–300 Westage Business Center Drive – Suite 350 Fishkill, NY

7 . JP CONSULTING ( ప్రసాద్ చిల్కమర్రి ) 3861 Long Prairie Road – Suite 108 Flower Mound, TX -2003

8 . NAVE TECHNOLOGIES ( మాధ్యు పిడతల )28345 Beck Road – Suite 105 Wixom, MI

9 . OAKRIDGE – ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు

10 . ICORE ( జగదీష్ గణపతినేది )8726 Town And Country Blvd, Suite 101 Ellicott City, MD

11 . MAI AOO – ( ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు )

12 . VIBERTECH ( ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు )

13 . GURUS ( బబిత సుఖవాసి )704 Pine Street Herndon, VA

14 . ADWAIT ( ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు )

15 . QDATA ( ఎక్కడా ఇన్ఫర్మేషన్ లేదు )

16 . SAIKA ( దినేష్ త్రిపురనేని ) 300 E Royal Lane – Suite 112 Irving, TX

17 . SUHAN ( నాయుడు జిట్టా )Highway 183 – Suite 1125 Austin, TX

18 . MADDISOFT ( రమేష్ మద్ది ) 2500 City West Blvd., Suite#360 Houston, TX

19 . ICS GLOBAL (శ్రీహరి తాటవర్తి) ics 1231 Greenway Drive, Suite 375 Irving, TX

20 . GLOBAL OUTLOOK ( ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు )

21 . TEKPROS ( భావన నందిగం ) 5068 W. Plano Parkway – Suite 255 Plano, TX

22 . CAMELOT ( రవి వి )2000 S Dairy Ashford Rd – Ste 265 Houston, TX

23 . MAGNUM( రాజేష్ పిల్లా ) 8215 Roswell Rd, Building 900 – Suite 930 Atlanta, GA

24 . @magnumopusit.com ( సాగర్ లాగిశెట్టి ) 1700 Water Place Se – Suite #310 Atlanta, GA

24 . H TOWN ( ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు )

25 . KYN LIFE CORP ( ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు )

26 . AE INFOTECh ( ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు )

పైన వివరించిన ఇన్నోవా సొల్యూషన్ / టెంపుల్టన్ కంపెనీల మాదిరే ఎంఓయూలు కుదుర్చుకున్న టీడీపీ అభిమానులందరూ ఎవరికి దొరికింది వాళ్లు ఎంత వీలయితే అంత ఐటీ పాలసీని అడ్డంబెట్టుకొని దోచుకొంటున్నారు .

పైన పేర్కొన్న ఐటీ పాలసీలో స్కిల్ డెవలప్మెంట్ కి ప్రోత్సాహకమని ఉంది . దానికి ఒక్కో మనిషికి 10 వేలు ప్రభత్వం ఇస్తుంది . దీనిని అడ్డంబెట్టుకొని మన ఊర్లలో ఇంటర్ నుండి ఇంజనీరింగ్ వరకు చదువుకున్న వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్లకి స్కిల్ డెవలప్మెంట్ ( బేసిక్ కంప్యూటర్ ) చేశామని వందల కోట్లు ఇప్పటికే దోచుకున్నారు .

ఈ కంపెనీలు ఎక్కడ ఉండవు , కొత్తగా ఉద్యోగాలు ఎవ్వరికీ ఇవ్వరు . ఎదో ఒక పేరుతొ కంపెనీని రిజిస్టర్ చేయటం దానిలో ఉద్యోగస్థులుగా సొంత కుటుంభం సభ్యుల పేర్లు రాసుకోవటం , అవసరమయితే ఎక్కడో ఒక చిన్న గది అద్దెకు తీసుకోవటం దానిలో పనికిరాని 10 కంప్యూటర్లు పెట్టటం . అవన్నీ చూపెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చామని , 100 మందికి ఇచ్చామని , 1000 మందికి ఇచ్చామని నీ స్థోమతని బట్టి తెలుగుదేశంలో నీకున్న విలువని బట్టి , లోకేష్ తో నీకున్న సంబంధాలని బట్టి పైన పేర్కొన్న కోట్ల రూపాయల్ని ప్రోత్సాహక రూపంలో దోచుకోవచ్చు .

కేవలం ఈ మూడు సంవత్సరాలలోనే చంద్రబాబు ప్రభుత్వం లక్షా యాభై వేల కోట్లు అప్పు చేసింది . ఎక్కడా కోటి రూపాయల విలువగల పనికూడా చేయలేదు , అంతేకాదు ఎవ్వరికీ కనీసం ప్యూన్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు . మొత్తం డబ్బంతా ఇలాంటి కుంభకోణాలకే పోతుంది .ఇప్పటికే అనేక కుంభకోణాలకి సంభందించి నేను పూర్తి ఆధారలని కేంద్రానికి పంపటం జరిగనది .ిఏదో ఒకరోజు పాపం పండటం ఖాయం , తండ్రీ కొడుకుఊచలు లెక్క పెట్టటం ఖాయం అని సదరు నెటిజన్ పెట్టాడు .

FYI :

Posted by ఒరై సాంబా, రాస్కో on Saturday, 12 May 2018

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat