ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తా..బాలికతో పారిపోయిన హెడ్ మాస్టర్ – Dharuvu
Home / CRIME / ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తా..బాలికతో పారిపోయిన హెడ్ మాస్టర్

ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తా..బాలికతో పారిపోయిన హెడ్ మాస్టర్

ప్రేమకు వయస్సు లేదంటూ చేప్పే కొన్నీ సీన్లు మనం సినిమాలో చూసి ఉంటాం..కాని ఇది నిజంగా జరిగితే ఎలా ఉంటుందో మీరే చూడండి. మాయమాటలు చెప్పి స్కూల్ హెడ్ మాస్టరే ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు. విద్యార్థినితో పారిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకెళితే.. ముచ్చింతల్‌‌కు చెందిన ఓ బాలిక పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణురాలు కాలేకపోయింది. ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తానని చెప్పి బాలికకు మాయమాటలు చెప్పి హెడ్ మాస్టర్ అక్బర్ ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది.

దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటివలనే కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు మండలమైన కౌతాళంలోని ఓ కుగ్రామంలో వింత వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 27న జరిగిన ఈ వివాహం లో వరుడి వయసు కేవలం 13 ఏళ్లు కాగా, వధువు వయసు 23 ఏళ్లు. ఇదో రకమైన బాల్య వివాహమంట.