చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్లారీటీ ..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్లారీటీ ..!

చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్లారీటీ ..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి.పలు కేసులను బనాయించి నన్ను అరెస్టు చేసే వీలుంటుంది అని ఆయన పలు మార్లు పలు సభల్లో అన్న విషయం తెల్సిందే.

అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కర్ణాటక ఎన్నికల తర్వాత కేసులు బనయిస్తామని తమపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద ఇటివల ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిపై కేంద్రమే నేరుగా కేసులు పెట్టె వీలుంటుందా ..?.ఇప్పటిదాకా ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా ..అయిన తప్పులు చేయనప్పుడు ఎందుకు భయపడాలి ..ఎందుకు ఇలా తమపై బురద చల్లుతున్నారు .ఒకవేళ కేసులు పెడితే న్యాయంగా తాము నిర్దోషులమని నిరూపించుకోవాలి కదా అని ఆయన అన్నారు ..ఒకవేళ కేసులు పెడితే బాబు జైలు మెట్లు ఎక్కడం ఖాయమని అన్నారు ..