ఏపీకి శుభవార్త చెప్పిన మోడీ సర్కార్..!! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / ఏపీకి శుభవార్త చెప్పిన మోడీ సర్కార్..!!

ఏపీకి శుభవార్త చెప్పిన మోడీ సర్కార్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన మోడీ సర్కార్..ఎట్టకేలకు ఏపీ కి ఒక శుభవార్త తెలిపింది.రాష్ట్రంలోని అనంతపురంలో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారం రూ. 902 కోట్ల వ్యయంతో సెంట్రల్‌ వర్సిటీని కేంద్రం నిర్మించనుంది. సెంట్రల్ వర్సిటీకి పూర్తి స్థాయి క్యాంపస్‌ నిర్మించే వరకు ఏపీ ప్రభుత్వం చూపే తాత్కాలిక భవనాల్లోనే తరగతులు నిర్వహించనున్నారు.అయితే ఈ నిర్మాణానికి సంబంధించి బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం..