హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ..! – Dharuvu
Breaking News
Home / SLIDER / హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ..!

హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్ ..!

అరూరి రమేష్ ఈ పేరు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో .గతంలో ఒకసారి అర్ధరాత్రి హైదరాబాద్ మహానగరం నుండి అప్పటి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వస్తున్నా సమయంలో రోడ్డు పక్కన ప్రమాదం జరిగి ప్రాణాలు పోతూ పడిఉన్న క్షత్రగాత్రులను చూసి ఉన్నఫలంగా తన కాన్వాయ్ ను ఆపించి
మరి తను కిందకు దిగి తన సొంత కార్లో వారిని ఎక్కించి ముందు ఒక సైరాన్ ఉన్న కారును వెనక కారును పెట్టించి మరి హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టిన సంఘటన ఏకంగా గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆకట్టుకుంది .

అంతే కాకుండా ముఖ్యమంత్రి గారే స్వయంగా అభినందించారు కూడా అప్పట్లో .ఆ తర్వాత నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను అమలు చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.అయితే తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే అర్ధరాత్రి అనక పగలు అనక ఉన్నఫలంగా వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికీ అండగా నిలుస్తూ నియోజకవర్గ ప్రజలచేతనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు .తాజాగా నియోజకవర్గంలో నక్కలపల్లి గ్రామంలో వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన ముగ్గురు పిల్లలు ఈతకు వెళ్లి మరి ప్రమాదవశాత్తు మృతి చెందారు .

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్ రజియాబేగం ,అబ్దుల్ కుటుంబాన్ని పరామర్శించి ఔదార్యాన్ని చాటుకున్నారు .వీరిద్దరికీ జన్మించిన షేక్ అజీజ్ పాషా -అజీజ్ బాబా,(13) అనే కవల పిల్లలు ,తన సోదరుడి కుమారుడు ఖాదర్ పాషా (12)ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారు.అయితే ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఎమ్మెల్యే అరూరి రమేష్ కుటుంబాన్ని సందర్శించి మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అని ..పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు .అంతే కాకుండా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతలకు వీరికి ఎప్పుడు ఏ కష్టమొచ్చిన నాదగ్గరకు తీసుకురావాలి అని ఆదేశించి మరోసారి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు .