పెట్టుబడి సాయం వదులుకున్న ఎంపీ కవిత – Dharuvu
Breaking News
Home / SLIDER / పెట్టుబడి సాయం వదులుకున్న ఎంపీ కవిత

పెట్టుబడి సాయం వదులుకున్న ఎంపీ కవిత

అన్నదాతకు అండగా, రైతులకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏడాదికి రూ.8000 వేల చొప్పున ‘రైతు బంధు’పథకం పేరుతో అందిస్తుంది.ఈ క్రమంలోనే రైతు బంధు పథకానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లబిస్తున్నది.

అయితే ఇప్పటికే కొంతమంది రైతులు ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయంను తిరిగి ప్రభుత్వానికే ఇస్తున్నారు.అందులోభాగంగానే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌లో రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు ప్రజాప్రతినిధులు, అధికారులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రైతు బంధు పథకంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం రూ.1.32లక్షలను ఎంపీ కవిత కుటుంబం వదులుకున్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 62 521 మంది రైతులకు రూ51.52 కోట్ల విలువైన చెక్కులు పంపణీ చేసినట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..దేశం గర్వించదగ్గ పథకం ‘రైతు బంధు’ పథకం అని… తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను.. ఇతర రాష్ట్రాల నేతలు తమ పార్టీ మేనిఫెస్టోలో పెడుతున్నారని తెలిపారు.