మరోసారి మానవత్వం చాటుకున్న సంతన్న – Dharuvu
Breaking News
Home / SLIDER / మరోసారి మానవత్వం చాటుకున్న సంతన్న

మరోసారి మానవత్వం చాటుకున్న సంతన్న

టీ న్యూస్ ఎండీ ,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధ పడుతోన్న ఓ పసికందు చికిత్సకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ₹ 2 లక్షలు మంజూరు చేశారు. ఈమేరకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన ఎల్ఓసీని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఆ పసికందు తండ్రి, ఎలెక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు తిరుపతి నాయక్ కు అందించారు. 3 రోజుల క్రితం జన్మించిన తిరుపతి నాయక్ కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ లక్డీకపూల్లోని హోప్ చిల్డ్రెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.

సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే సంతన్న, పసిపాప చికిత్స కోసం ₹ 2 లక్షలకు ఎల్ఓసీ మంజూరు చేయించడంలో చొరవ చూపి, మరోసారి తన మానవత్వాన్ని నిరూపించుకున్నారు. పసిపాపకు చికిత్స సజావుగాసాగేలా తాను పూర్తి చేయూత అందిస్తానని ఈ సందర్బంగా జర్నలిస్టు తిరుపతి నాయక్ కు హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న ఆర్తులకు ఆపన్నహస్తం అందించడంలో తాను అన్ని వేళలా ముందుంటానని ఈ సంఘటనతో ఎంపీ సంతన్న మరోసారి రుజువు చేసుకున్నారు