సంచలన నిర్ణయం తీసుకున్నటీటీడీ..!! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / సంచలన నిర్ణయం తీసుకున్నటీటీడీ..!!

సంచలన నిర్ణయం తీసుకున్నటీటీడీ..!!

ఏపీ లోని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులు వయసు 65 దాటితో వారిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశమైంది. వయసుపైబడిన అర్చకులు రిటైర్ కావాలని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణ దీక్షితులు వెంటనే రిటైర్ కావాల్సి ఉంది.కాగా, వెంకన్న కానుకలను ప్రైవేట్‌ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించేందుకు పాలకమండలి ఓ సబ్‌ కమిటీని నియమించింది. తిరుమలలో శుభ్రత పర్యవేక్షణకు మరో కమిటీని వేశారు.