కర్ణాటక రాజ”కీయం”-బీజేపీ పార్టీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ..! – Dharuvu
Breaking News
Home / NATIONAL / కర్ణాటక రాజ”కీయం”-బీజేపీ పార్టీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ..!

కర్ణాటక రాజ”కీయం”-బీజేపీ పార్టీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ..!

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న బుధవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో బీజేపీ పార్టీకి 105,కాంగ్రెస్ పార్టీకి 78,జేడీఎస్ పార్టీకి 37,ఇతరులకు 02 స్థానాలు వచ్చాయి.ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో గవర్నర్ వారం రోజులు వ్యవధి బీజేపీ పార్టీ ఇచ్చారు.ఈ క్రమంలో తమ తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు
జారిపోకుండా క్యాంపు రాజకీయాలను స్టార్ట్ చేశాయి కాంగ్రెస్,జేడీఎస్ పార్టీ నాయకత్వం .

అయితే జేడీఎస్ అధినేత దేవెగౌడ ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలకు జేడీఎస్ పార్టీకి చెందిన ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వలన వారు హాజరు కాలేదు అని దేవేగౌడ క్లారిటీ ఇస్తున్న కానీ బీజేపీ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ,గాలి జనార్ధన్ రెడ్డి తమ్ముడు శ్రీరాములు జరిపిన రాయభారం ప్రభావంతో బీజేపీ పార్టీకి జై కొట్టారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు .చూడాలి మరి కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో ..!