ఆటో యూనిఫాంలో వైఎస్‌ జగన్‌..వాళ్ల ఆనందానికి అవధుల్లేవు..! – Dharuvu
Breaking News
Home / ANDHRAPRADESH / ఆటో యూనిఫాంలో వైఎస్‌ జగన్‌..వాళ్ల ఆనందానికి అవధుల్లేవు..!

ఆటో యూనిఫాంలో వైఎస్‌ జగన్‌..వాళ్ల ఆనందానికి అవధుల్లేవు..!

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే సోంత అన్నలా హామీలు ఇస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతి పక్షనేత వైఎస్‌ జగన్‌. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ ను బుధవారం ఆటో డ్రైవర్లు కలిశారు. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేలు ఇస్తామన్న జగన్ హామీపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్ల మద్దతు ఉంటుందని తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్‌ జగన్‌ ఆటో యూనిఫాం (కాకి చొక్కా) ధరించి ఆటో నడిపారు. వైఎస్ జగన్‌ ను తమ గుండెలాంటి ఆటో ఎక్కించి సంతోషించారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆనందంతో పొంగిపోయారు. 14వ తేదీని ఏలూరు సభలో వైఎస్ జగన్ ఆటోవాళ్లకు ఇచ్చిన హామీలు ఇవే.. సొంత ఆటో ఉన్న ప్రతి ఒక్కరికీ..ఏడాదికి 10వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆటోవాళ్లకు అండగా ఉంటానని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆటో కొనుగోలు చేసేవారికి పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తుందని ఆయన ప్రకటన చేశారు.దీంతో ఆటోవాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతేకాదు అక్కడ జగన్ చూసి మనలో ఇంత కలసి మెలసి ఉంటాడు జగన్ అని అంటున్నారు సామన్య ప్రజలు.