ట్విట్టర్ వేదికగా.. శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్ – Dharuvu
Home / SLIDER / ట్విట్టర్ వేదికగా.. శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్

ట్విట్టర్ వేదికగా.. శుభవార్త చెప్పిన మంత్రి కేటీఆర్

ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సిర్పూరు పేపర్ మిల్లు పునరుద్ధరణపై మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్‌లో స్పందించారు. బ్యాంకు ఒప్పందంతో అడ్డంకులు తొలగిపోయాయనీ, దీనికి ప్రత్యేక కృషి చేసిన సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఇండస్ట్రియల్ సెక్రటరీ జయేష్ రంజన్‌ను అభినందిస్తూ ఐటీ శాఖ మంత్రి కేటీర్ ట్వీట్ చేశారు. దీంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమైంది.