ముఖ్యమంత్రి అయిన మొదటి గంటలోనే యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ ..! – Dharuvu
Home / ANDHRAPRADESH / ముఖ్యమంత్రి అయిన మొదటి గంటలోనే యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ ..!

ముఖ్యమంత్రి అయిన మొదటి గంటలోనే యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ ..!

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో మలుపుల తర్వాత ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఆయన పదవీ చేపట్టిన గంటల్లోనే ప్రభుత్వంలోని కీలక నిర్ణయాలను తీసుకున్నారు .ఈ క్రమంలో ప్రభుత్వంలోని కీలక విభాగాలను బదిలీ చేశారు .ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులను యడ్డీ బదిలీ చేశారు.

వీరందర్నీ బెంగుళూర్ సిటీకి బదిలీ చేశారు . రైల్వేస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న అమర్ కుమార్ పాండేను ఐజీ అడిషనల్ డైరెక్టర్ గా బెంగుళూరుకు బదిలీ చేశారు .

డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా ఉన్న సందీప్ పాటిల్ ను ఇంటెల్ జెన్స్ డీఐజీగా ..బీదర్ ఎస్పీగా ఉన్న దేవరాజ్ ను బెంగుళూర్ సిటీ సెంట్రల్ డివిజన్ కు డిప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్ గా ..ఏసీబీ ఎస్పీగా ఉన్న ఎస్ .గిరీష్ ను బెంగుళూర్ సిటీ నార్త్ ఈస్ట్ డివిజన్ కు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బదిలీ చేశారు .అయితే వీటిపై విమర్శల పర్వం కొనసాగుతుంది ..