వచ్చే నెల 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ..!! – Dharuvu
Home / LIFE STYLE / వచ్చే నెల 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ..!!

వచ్చే నెల 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ..!!

ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 8,9 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలోని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ చేయనున్నట్టు బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న చేప ప్రసాదం పంపిణీని నిస్వార్థంగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొనసాగిస్తున్నట్టు ఆయన చెప్పారు. చేపప్రసాదం తీసుకున్న తర్వాత 40 రోజుల పాటు కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఉబ్బసం, శ్వాస సంబంధిత రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు.తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని.. జీహెచ్ఎంసీ, జలమండలి, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు సహకరించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారని హరినాథ్ గౌడ్ వివరించారు.