మరోసారి రోడ్డు పైకి శ్రీరెడ్డి..అక్కడ ఉన్నవారు అవాక్క్ – Dharuvu
Home / MOVIES / మరోసారి రోడ్డు పైకి శ్రీరెడ్డి..అక్కడ ఉన్నవారు అవాక్క్

మరోసారి రోడ్డు పైకి శ్రీరెడ్డి..అక్కడ ఉన్నవారు అవాక్క్

టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. గతంలో టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండిచారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ప్రకటించుకున్నారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈ సారి సినీ పరిశ్రమ గురించి కాకుండా సాధారణ ప్రజలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీరెడ్డి, మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గురిజేపల్లి సమీపంలో కొందరు తమకు ఉపాధి పనులు కల్పించడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. అటుగా వెళ్తున్న శ్రీరెడ్డి కారు దిగేసి, తలకు తలపాగా చుట్టుకొని స్థానికులకు మద్దతుగా రోడ్డుపై నిరసన తెలిపారు. అయితే ఆమెను చూసిన అక్కడ వారు అవాక్కయ్యారు. శ్రీరెడ్డి ఏంటీ ఇలా త‌మ‌కు మ‌ద్దతు ఇవ్వడం ఏంటని విస్తుపోయారు. కాసేపు అక్కడ హ‌డావిడి చేసిన ఆమె, స్థానికులతో ముచ్చటించారు. అనంతరం త‌న కారులో అక్కడ నుండి వెళ్లిపోయారు.