ప‌శ్చిమ‌లో వైసీపీలోకి చేరిన‌.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌.. ఎఎంసీ మాజీ ఛైర్మన్ – Dharuvu
Home / ANDHRAPRADESH / ప‌శ్చిమ‌లో వైసీపీలోకి చేరిన‌.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌.. ఎఎంసీ మాజీ ఛైర్మన్

ప‌శ్చిమ‌లో వైసీపీలోకి చేరిన‌.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌.. ఎఎంసీ మాజీ ఛైర్మన్

ఏపీలో ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క‌క్షుడు వైఎస్ జగన్ ప్ర‌జాసంకల్పయాత్ర పేరుతో చేప‌ట్టిన పాద‌యాత్ర‌ ఏ జిల్లాలో అయిన ప్రభంజనం అంత ఇంతా కాదు ఎక్క‌డ చూసిన అశేశ జ‌న‌వాహిని మ‌ద్య పాద‌య‌త్ర కొన‌సాగుతుంది. పాద‌యాత్ర‌కు ముందు జనాలు లేని జగన్ పాదయాత్రను, జగన్ సభలను ఎప్పుడు చూడాలి? ఎప్పుడు ప్రచారం చేయాలి? ఇలాంటి అవకాశం కోసం జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ కూడా చంద్రబాబుతో పాటు ఆయన భజన మీడియా కూడా వెయిటింగ్. కానీ కడప నుంచీ మొదలెడితే ఎక్కడా కూడా పచ్చ బ్యాచ్‌కి అలాంటి అవకాశం దొరకలేదు. రాయలసీమ విషయం పక్కనపెట్టినా కుల బలం ఎక్కువగా ఉన్న గుంటూరు, కృష్ణాల్లో జగన్ దెబ్బతింటాడనుకుంటే అక్కడ అంతకుమించి అనే స్థాయిలో ప్రజాదరణ కనిపించింది.

తాజాగా పశ్ఛిమగోదావరి జిల్లాలో జన ప్రభంజనం కనిపించింది. వరుసగా వైసీపీలోకి వ‌ల‌స‌లు కూడ మొద‌లు అవ్వ‌డంతో టీడీపీ పెద్దల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎఎంసీ మాజీ ఛైర్మన్ పిపిఎన్ చంద్రారావు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచేవరకూ ప్రజల సమక్షంలోనే ఉంటానని శపథం చేశారు. గ్రౌండ్ లెవెల్‌లో అధ్యయనం చేశానని 2019 ఎన్నికల్లో పశ్ఛిమ గోదావరి జిల్లాలో వైసీపీకు మెజారిటీ సీట్లు ఖాయమని చంద్రారావు చెప్పారు.