Home / MOVIES / స‌న్నీ లియోన్ ఫోటో వైర‌ల్‌..!!

స‌న్నీ లియోన్ ఫోటో వైర‌ల్‌..!!

స్టార్ హోదా అనేది చాలా సింపుల్‌గా రాద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హోదాను అనుభ‌విస్తున్న వారంతా.. ఒక‌ప్పుడు త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ ఎదిగిన వారే. ఆ లిస్టులో స‌న్నీ లియోన్ కూడా ఒక‌రు. చిన్న‌ప్పుడు దుర్భ‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న స‌న్నీ లియోన్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తోంది. నూత‌న న‌టీన‌టుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది. క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిదీ ఏమీ లేదంటూ చాటిచెబుతోంది.

అయితే, పోర్న్ స్టార్ స్టేట‌స్ నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్న స‌న్నీ లియోన్‌కు బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌, ప‌లు ఇండస్ట్రీల్లో అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ క్ర‌మంలోనే వ‌చ్చిన చిత్రం వీర మ‌హాదేవి. స‌న్నీలియోన్ ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం తెలుగు భాష‌తోపాటు త‌మిళం, మ‌ళ‌యాళం భాష‌లోనూ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోష‌న్స్‌లో భాగంగా చిత్ర బృందం తాజాగా స‌న్నీ లియోన్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఆ పోస్ట‌ర్‌లో స‌న్నీ లియోన్ తెల్ల‌టి గుర్రంపై వీర నారిలా క‌నిపిస్తోంది. ఐటెం గాల్‌గా పేరుపొందిన స‌న్నీ లియోన్‌.. ఆ పేరును చెరిపివేస్తూ మంచి ప్రాధాన్య‌మున్న పాత్ర‌తో హిస్టారిక‌ల్ చిత్రంలో న‌టిస్తోంది.

వీర మ‌హాదేవి చిత్రానికి వీ.సీ. వ‌డివుడైయాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. పోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat