Home / LIFE STYLE / రాగి జావ తాగేద్దామా…!!

రాగి జావ తాగేద్దామా…!!

కాసిని నీళ్లూ, రెండు చెంచాల రాగి పిండి, ఓ బెల్లం ముక్క.. ఈ మూడింటితో తయారయ్యే రాగిజావ నిజంగా ఆరోగ్య ప్రదాయినే. ఈ సమయంలో దీన్ని రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు కూడా ఉన్నాయి.

ఇంతకీ అవేంటంటే…

* రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.

* వీటిలో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో దీన్ని తరచూ తీసుకోవడం మంచిది.

* రాగి పిండిలో విటమిన్‌-సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం ఒక్కటే కాదు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

‌* వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి.

* బరువు తగ్గాలనుకునేవారికి రాగులను చక్కగా తమ భోజనంలో చేర్చుకోవచ్చు. జావ రూపంలోనే కాదు, ఇలాంటివారు సంగటిగానూ తీసుకోవచ్చు.

* రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి.

* దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు.

* రక్తంలో కొలెస్ట్రాల్స్‌ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా కూడా చూసుకోవచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat