Home / SLIDER / హైదరాబాద్ ఘన విజయం..!!

హైదరాబాద్ ఘన విజయం..!!

IPL క్యాలిఫయర్ -2 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఘన విజయం సాధించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ తో బరిలోకి దిగిన హైద‌రాబాద్ 174 పరుగులు చేసింది. 175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 9వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
కోల్ కతా బ్యాట్స్ మెన్స్ లో క్రిస్ లిన్ 48,శుభమ్ గిల్-30, సునీల్ నారాయణ్ 26, నితీష్ రాణా 22 పరుగులు చేయగా… దినేష్ కార్తీక్ 8 పరుగులు చేశారు.అయితే ఈ మ్యాచ్ లో  విజయం సాధించిన హైదరాబాద్ ఫైనల్ కు చేరింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నైతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.