ముస్లింలు ఎక్కువగా ఒక నెంబర్‌ను ఉపయోగిస్తారు. అదే 786. దీని కారణం చాలా మందికి తెలియదు. ఐదో శతాబ్దంలో పుట్టిన అరబిక్ భాషలో 28 అక్షరాలు ఉంటాయి. అబ్జత్ న్యూమరల్స్ ప్రకారం అరబిక్ భాషలోని 28 అక్షరాలకు ఒక్కో నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ ప్రారంభంలో అత్యంత సహన శీలి, త్యాగ మూర్తి అయిన అల్లా అని ఉంటుంది.
అయితే, ఈ పవిత్ర వాఖ్యం రాయడానికి ఉపయోగించు అక్షరాల న్యూమరిక్ వాల్యూలను కలిపితే 786 వస్తుంది. అందుకు ముస్లింలు పవిత్రతకు సింబాలిక్‌గా 786 నెంబర్‌ను వాడుతారు. వారికి సంబంధించిన ప్రతీ దానిపైనా ఈ నెంబర్‌ను రాస్తారు. అందుకే ఈ నెంబర్‌ను ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు.