Home / MOVIES / ‘రాజుగాడు’.. హిట్ ఖాయమట..!

‘రాజుగాడు’.. హిట్ ఖాయమట..!

టాలీవుడ్ యువనటుడు రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం “రాజుగాడు”. సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమైరా దస్తూర్ కథానాయికగా నటించింది.హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీ జూన్ ఒకటో తేదిన విడుద‌ల చేయ‌నున్నారు.

తనకి తెలియకుండానే చిన్న చిన్న దొంగతనాలు చేసే ఒక వింత వ్యాధి లక్షణం కలిగినవాడిగా రాజ్ తరుణ్ ఈ సినిమాలో కనిపిస్తాడట. అతనికి గల ఈ వ్యాధి కారణంగా ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథా కథనాలతో ఈ సినిమా నిర్మితమైంది.

ఈ పాయింట్ ను ఆధారంగా చేసుకునే ఈ సినిమా పూర్తి వినోదభరితంగా కొనసాగుతుందట. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ ఉన్నాడని టాక్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat