సాయిపల్లవి ఫిదా మూవీ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న నేచురల్ బ్యూటీ .ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆ మూవీ బ్లాక్ బ్లాస్టర్ కాకపోయిన కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్న ముద్దుగుమ్మ .
అయితే ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అమ్మడు .ఆ ఇంటర్వ్యూ లో అమ్మడు ఒక ముఖ్యమైన విషయం తెల్పింది .అదే అటు తమిళం ఇటు తెలుగు ఇండస్ట్రీ లో వరస మూవీలతో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న హీరో సూర్య గురించి అమ్మడు మాట్లాడుతూ ఆయన అంటే చాలా ఇష్టం .
ఆయన షూటింగ్ సమయంలో కన్పిస్తే ఏమి మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాను .ఆయన డెడికేషన్ చాలా ఇష్టం .అందుకే ఆయన అంటే అంత అభిమానం అని అమ్మడు చెప్పుకుంటూ వచ్చింది ..